No Headline
● నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులోని బీసీ, ఎస్సీ బాలికల హాస్టళ్లలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. అవసరానికి సరిపడ నీళ్లు లేక పలువురు విద్యార్థులు టీసీలు తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. బాత్‌రూమ్‌ల సమస్య కూడా తీవ్రంగా ఉంది. అలాగే బాలికల ఎస్సీ, బీసీ కళాశాల హాస్టళ్లలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు.
● దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్వగ్రామమైన లద్దగిరిలోని బీసీ హాస్టల్–1, 2 భవనాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దీంతో అధికారులు తాత్కలికంగా స్థానిక హైస్కూల్లో విద్యార్థులకు వసతిని ఏర్పాటు చేశారు. అలాగే హాస్టళ్లలో 422 మంది విద్యార్థులకు సరిపడే బాత్‌రూమ్‌లు లేక ఆరుబయట స్నానాలు చేస్తున్నారు.
● నియోజకవర్గంలోని సి.బెళగల్ గురుకుల పాఠశాలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలు ఈ ఏడాది జూన్ నెల నుంచి పనిచేయడం లేదు.
● నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో 53 ఏళ్ల క్రితం నిర్మించిన ఎస్సీ బాలికల వసతి గృహం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది.
● పత్తికొండలోని సమీకృత ప్రభుత్వ వసతి గృహంలో 350 మంది విద్యార్థులు వసతి పొందుతుండ గా కనీసం ఒక్క వాచ్‌మెన్ కూడా లేకపోవడంగమనార్హం.
● మంత్రాలయం బీసీ హాస్టల్‌లో 110 మందికి గాను 8 మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లన్నీ నిరుప యోగంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులందరూ కంప చెట్ల మధ్య కాల కృత్యాలు తీర్చుకుంటున్నారు.
● కోసిగి కమ్యూనిటీ హాస్టల్‌లో 12 మరుగుదొడ్లు ఉన్నా శుభ్రతకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. ప్రహరీ లేకపోవడంతో పందుల బెడద తీవ్రమయ్యింది.
● పెద్దకడుబూరు బీసీ హాస్టల్‌లోని ఓ గదిలో పెచ్చులు ఊడటంతో డైనింగ్ హాల్‌లో విద్యార్థులు నిద్రపోవాల్సి వస్తోంది.
మౌలిక వసతులు కల్పించాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. అనేక వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌళిక సౌకర్యాలు లేవు. అవసరమైన టాయ్‌లెట్లు, బాత్‌రూములు నిర్మించాల్సి ఉంది. అలాగే పలు వసతి గృహాలకు ప్రహరీగోడలు కూడా లేవు. పలు వసతి గృహాల్లో పైకప్పులు పెచ్చులూడి ఎప్పుడు కూలిపోతాయో అనే విధంగా తయారయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విధంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలను పెంచాల్సి ఉంది.
– పీ శ్రీనివాసులు,
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment