హామీ ఇచ్చావు.. ఇల్లు ఎప్పుడిస్తావ్?
● ఇళ్ల స్థలాల కోసం కర్నూలు కలెక్టరేట్‌కు
వేలాదిగా తరలివచ్చిన పేదలు
కర్నూలు(సెంట్రల్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు తమకు ఇంటి నిర్మాణం కోసం మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని, రూ. 5 లక్షలు మంజూరు చేయాలంటూ వేలాది మంది పేదలు సోమవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం కర్నూలులోని సీపీఐ కార్యాలయం నుంచి వినాయక్ ఘాట్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పేదలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఎన్నికల హామీలో భాగంగా ఇళ్లు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment