కర్నూలు న్యూసిటీ: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని మైనింగ్ డీడీ రవిచంద్ హెచ్చరించారు. కల్లూరు మండలం తడకనపల్లి గ్రామ పరిధిలో అక్రమంగా గ్రావెెల్ తవ్వకాల చేస్తున్న పాంత్రాలను అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టా భూముల చదును నెపంతో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుతున్న 2 పొకై ్లన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మట్టి తరలిస్తున్న 2 లారీలు, 2 కంకర టిప్పర్లను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వాటిని నన్నూరు, ఉప్పలపాడు వీఆర్‌ఓలకు అప్పగించినట్లు తెలిపారు. విజిలెన్స్ ఏడీ వెంకటేశ్వర్లు, ఏజీ రాజశేఖర్, ఆర్‌ఐ సాంబశివారెడ్డి, టీఏ కుమార్ పాల్గొన్నారు.
● నగర శివారు పరిసరాల ప్రాంతాల్లో బుధవారం మైనింగ్ ఽఅధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా కంకర తరలిస్తున్న టిప్పర్లు 10, గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు 2 పట్టుకున్నట్లు జిల్లా మైనింగ్ ఉపసంచాలకులు రవిచంద్ తెలిపారు. పట్టుబడిన టిప్పర్లను ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment