కర్నూలు (టౌన్): ఆలిండియా కోటా పీజీ మెడికల్ అడ్మిషన్ల మొదటి రౌండ్ ప్రక్రియ ముగిసినట్లు కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టీ నరసమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోటా పీజీ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కింద 77 సీట్లకు గాను 48 మంది అడ్మిషన్లు తీసుకున్నట్లు అమె తెలిపారు.
నేడు ఫూలే వర్ధంతి
కర్నూలు(అర్బన్): బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి పి. వెంకటలక్షుమ్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకు స్థానిక బిర్లాగేట్ సమీపంలోని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుందన్నారు.
ప్రశాంతంగా సివిల్స్ కోచింగ్ ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్): బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారి కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి పీ వెంకటలక్షుమ్మ తెలిపారు. నగరంలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌లో బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షను నిర్వహించామన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి ఈ పరీక్షకు మొత్తం 50 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 47 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment