కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్ కోర్సుల్లో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య ఎన్.నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ సెట్ – 2024లో అర్హత సాధించని, పీజీ సెట్ – 2024కు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు సైతం స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తుతో పాటు, విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజులతో ఈనెల 28, 29 తేదీల్లో వర్సిటీలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో (ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్ ఆఫీస్) ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్‌లో వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఉండదన్నారు. ఎంఏ ఇంగ్లిష్ 18, తెలుగు 28, కామర్స్ 37, ఎకనామిక్స్ 32, బయో టెక్నాలజీ (సెల్ఫ్ ఫండింగ్) 19, బాటనీ 20, జువాలజీ 11, మ్యాథ్స్ 26, స్టాటిస్టిక్స్ (ఓఆర్ అండ్ ఎస్‌క్యూసి) 23, ఫిజిక్స్ 29, ఆర్గానిక్ కెమిస్ట్రీ 1, ఆర్గానిక్ కెమిస్ట్రీ (సెల్ఫ్ ఫండింగ్) 21, కంప్యూటర్ సైన్స్ (సెల్ఫ్ ఫండింగ్) 36 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ సీట్లకు స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment