కర్నూలు కల్చరల్: 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహి స్తున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థుల హాల్ టిక్కెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్‌సైట్ www.bse.ap.gov. in లో స్కూల్ లాగిన్‌లో అందుబాటులో ఉంచడమైందని పేర్కొన్నారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యూ–డీఐఎస్‌ఈ కోడ్ ద్వారా విద్యార్థుల హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు.
29 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 29 నుంచి జనవరి 2వ తేదీ వరకు డిగ్రీ 3, 5 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment