కర్నూలు(అగ్రికల్చర్): ఎన్‌టీఆర్ పెన్షన్ కానుక కింద డిసెంబరు నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4,56,936 పింఛన్లకు రూ.194.02 కోట్లు మంజూరయ్యాయి. నవంబరు నెలతో పోలిస్తే డిసెంబరు నెలకు 1,528 పింఛన్లపై కోత పడింది. చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నెలనెల గుట్టుచప్పుడు కాకుండా పింఛన్లలో కోత విధిస్తోంది. కర్నూలు జిల్లాలో 2,40,330 పింఛన్లకు సంబంధించి రూ.102.55 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,16,606 పింఛన్లకు సంబంధించి రూ.91.47 కోట్లు ప్రకారం రూ.194.02 కోట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులను ఈ నెల 30న బ్యాంకులకు విడుదల చేస్తుంది. అదే రోజున గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి డ్రా చేస్తారు. డిసెంబరు ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేస్తారు. వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడవ నెలలో మూడు నెలల పింఛన్ తీసుకోవచ్చు.
నవంబరు నెలతో పోలిస్తే
ఉమ్మడి జిల్లాలో 1,528 కోత
Comments
Please login to add a commentAdd a comment