బాల్య వివాహాలు నేరం
కర్నూలు (లీగల్): బాల్య వివాహాలు దురాచారం, నేరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో బాల్య వివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటలక్ష్మమ్మ, కర్నూలు సీడీపీఓ అనురాధ, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్) స్నేహలత, కర్నూలు జిల్లా డీసీపీఓ శారద, సీడబ్ల్యూసీ చైర్మన్ జుబేదా బేగం, బాలల పరిశీలన అధికారి హుసేన్ బాషా, నవయుత చైల్డ్ రైట్స్ ఫోరం ఎన్‌జీఓ లక్ష్మీనారాయణ, లయన్స్ క్లబ్ ఎన్‌జీఓ రాయపాటి శ్రీనివాసులు, టౌన్‌మోడల్ స్కూల్ స్కౌట్ విద్యార్థులు, అంగన్‌వాడీ వర్కర్లు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి
Comments
Please login to add a commentAdd a comment