అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు
టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అయితే వారు దానిని నిలుపుకోలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉచిత ఇసుకపై గత ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇప్పుడు ఇసుక ధర గత కంటే రూ.1000 ఎక్కువగా ఉంది. సూపర్‌సిక్స్ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు. హమీలు ఇచ్చిన సమయంలో ఎంతో గర్వంగా ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీన మేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. – జి.చంద్రశేఖర్,
ఏఐటీయూసీ నగర కార్యదర్శి, కర్నూలు
ఎవరూ సంతోషంగా లేరు
ఈ ప్రభుత్వంలో ఏ వర్గాలు సంతోషంగా లేవు. గత ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరిలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు సమ్మెకు వెళ్లిన సమయంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. జూలై నుంచి జీతాలు పెంచుతామని చెప్పింది. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో వాటిని పట్టించుకోవడం లేదు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వంట ఏజెన్సీలు, పారిశుద్ధ్య పనులు చేసే ఆయాలను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత లేకుండా రాజకీయపార్టీలు చెప్పిన వారికే కట్టబెడుతున్నారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
ప్రారంభమైంది. – పి.నిర్మల, సీపీఎం
రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు, కర్నూలు
త్వరలోనే
ఉద్యమ కార్యాచరణ
కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా కొంత సమయం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ తరపున నిర్ణయించుకున్నాం. అయితే ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. త్వరలోనే సూపర్ సిక్స్ కోసం ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తాం. అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపడతాం.
– ఎస్వీ మోహన్‌రెడ్డి,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment