No Headline
ప్రజలతో కిక్కిరిసిన కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో మొత్తం 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలోని భూములు, ఇండ్లు, స్థలాలు, ఇతర ఆస్తుల విలువ ను ప్రభుత్వం అమాంతం పెంచింది. భవన నిర్మాణ రంగం కుదేలై ఉన్న సమయంలో మళ్లీ ఆస్తుల విలువను పెంచడంతో మదుపరులు గగ్గోలు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు లబోదిబోమంటున్నారు. మరోవైపు ప్రభుత్వంపైకి మాత్రం స్థిర, చరాస్తుల విలువను 10 నుంచి 45 శాతం వరకు పెంచినట్లు అధికారికంగా చెబుతోంది. అయితే అందుకు భిన్నంగా రేట్లను పెంచారు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్, ఆదోని, ఎమ్మిగనూరు మునిసిపాలిటీల్లో దాదాపు 80 నుంచి 100 శాతం వరకు భవన నిర్మాణ రేట్లను పెంచారు. ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాల పరిధిలో 50 శాతం వరకు రేట్లు పెరిగాయి. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల సమీపంలో ఉన్న పొలాలు, భవన నిర్మాణ స్థలాల రేట్లు కూడా భారీగా పెరిగాయి. దాదాపు 50 – 60 శాతం వరకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల విలువను 10 శాతం వరకు, ఇళ్ల స్థలాల విలువను 20 శాతం వరకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి మొదట 15 శాతం రేట్లను మాత్రమే పెంచి జనవరి 1 నుంచి అమలు చేయాలని ఆదేశించింది. అయితే అధిక ఆదాయం కోసం మరోసారి రేట్లను పరిశీలన చేసి దాదాపు 45 శాతం వరకు అన్ని రకాల ఆస్తుల విలువను పెంచేలా ఆదేశాలు ఇచ్చింది.
వినియోగదారులపై
భారం ఎలా పడుతుందంటే..
కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఇప్పటి వరకు చదరపు గజం ఇంటి విలువ రూ.2,500 ఉంది. దానిని ప్రస్తుతం రూ.5వేలకు పెంచారు. అంటే దాదాపు 50 శాతం పెరిగింది. గజం విలువ రూ.2,500 ప్రకారం 2.75 సెంట్ల స్థలాన్ని వినియోగదారుడు కొనుగోలు చేస్తే దాని మొత్తం విలువ రూ.3,32,500కు రిజిస్ట్రేషన్, సర్‌చార్జీ, యూజర్ చార్జీల కింద 7.5 శాతం చెల్లించాలి. పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీల ప్రకారం అదే 2.75 సెంట్ల స్థలాన్ని అదే వినియోగదారుడు ఇప్పుడు కొనుగోలుచేయాలంటే ఫీజు కింద 49,875 చెల్లించాలి.
● కర్నూలులోని గాంధీనగర్‌లో ఇప్పటి వరకు గజం విలువ రూ.30 వేలు ఉంది. ప్రస్తుతం దాని గజం విలువ రూ.75 వేలకు చేరింది. ఇప్పుడు ఇక్కడ ఓ వినియోగదారుడు 2.75 సెంట్ల స్థలా న్ని కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనప్పుడు మొత్తం విలువ 39,90,000కు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 7.5 శాతం ప్రకారం చెల్లించారు. రిజిస్ట్రేషన్ విలువ పెరిగిన తరువాత అదే 2.75 సెంట్లస్థలాన్ని దాని మొత్తం విలువ 99,75,000లకు గాను ఫీజు కింద 7.5 శాతం ప్రకారం అంటే రూ.7,48,125 చెల్లించాలి. ఫిబ్ర వరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగు తుండటంతో వారం రోజులుగా క్రయ, విక్రయా లు జోరందుకున్నాయి.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలపై మరింత భారం మోపుతోంది. డిసెంబర్, జనవరి నెలల్లో రూ.17 వేల కోట్ల విద్యుత్ ట్రూఅప్ చార్జీలను వేసింది. ఫిబ్రవరి నుంచి స్థిర, చరాస్తుల విలువలను పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. భూముల విలువ 20 నుంచి 45 శాతం వరకు పెంచినట్లు చెబుతున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. కొన్నిచోట్ల నూరు శాతం, మరికొన్ని చోట్ల 50 శాతానికిపైగా పెరిగింది. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన దానికి విరుద్ధంగా సీఎం చంద్రబాబు నాయుడు భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడంపై అంతటా నిరసన వ్యక్తమవుతోంది.
నేటి నుంచి పెరిగిన చార్జీలతో
భూముల రిజిస్ట్రేషన్లు
గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతానికి
పైగానే భూముల విలువ పెంపు
కర్నూలు నగరం, పట్టణాల్లో
నూరుశాతం పెరుగుదల
జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన
ఉండే స్థలాలపై 50 శాతానికి పైగా
పెంపు
పొలాల విలువను 20 శాతానికిపైగా
పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
పెరిగిన విలువలతో రిజిస్ట్రేషన్
జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వారం రోజులుగా క్రయ, విక్రయదారులతో కిటకిటలాడాయి. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తుండటంతో ఎక్కువ మంది కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్ పనులను పెట్టుకున్నారు. అయితే స్థిర, చరాస్తుల విలు వల మదింపు కారణంగా ఆన్‌లైన్ సక్రమంగా రాక వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడ్డా రు. కాగా.. పెరిగిన విలువలతో శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment