నత్తనడకన ‘బాల ఆధార్’
● జిల్లాలో 0–6 సంవత్సరాల లోపు చిన్నారులు 1,06,944 మంది ● ఇప్పటి వరకు కేవలం 32,160 మందివి మాత్రమే నమోదు ● బాల ఆధార్ నమోదుకు 134 కిట్లు సరఫరా ● అందులో పనిచేయనివి 40
నమోదు వేగాన్ని పెంచుతాం
బాల ఆధార్ నమోదు ప్రక్రియ వేగాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి అందరు ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసు కోవాల్సి ఉంది. ఫిబ్రవరి 10వ తేది నాటికి పూర్తి స్థాయిలో జిల్లాలోని 0–6 మధ్య వయస్సు ఉన్న చిన్నారులందరికి ఆధార్ నమోదు చేయించేందుకు చర్యలు చేపడతాం. మండలాల్లో జరుగుతున్న ఇమేజ్ క్యాప్చరింగ్, ఈకేవైసీ, ఎన్‌పీసీఐ అప్రూవల్, మిస్సింగ్ సిటిజన్ సర్వే, బాల ఆధార్ నమోదు కార్యక్రమాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
– జీ నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ
● కర్నూలు అర్బన్‌లో మొత్తం 10,444 మంది 0–6 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చిన్నారులు ఉండగా, ఈ నెల 27వ తేదీ వరకు కేవలం 2,641 మంది చిన్నారులకు మాత్రమే ఆధార్ నమోదు చేశారు.
● ఆదోని అర్బన్‌లో 7,399 మందికి గాను, 2322 మందికి, ఎమ్మిగనూరు అర్బన్‌లో 38,88కు గాను 869 మందికి మాత్రమే నమోదు చేశారు.
● అలాగే కోసిగి, పెద్దకడబూరు, చిప్పగిరి, హాలహర్వి, ఆలూరు తదితర మండలాల్లో కూడా చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియలో పూర్తి జాప్యం జరుగుతోంది.
కర్నూలు(అర్బన్): జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం కారణంగా బాల ఆధార్ నమోదు నత్తనడకన సాగుతోంది. 0–6 సంవత్సరాల లోపు చిన్నారులందరికి ఆధార్ నమోదు చేయి ంచాలని ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నా, ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆధార్ నమోదు చేయించేందుకు సంబంధించి అంగన్‌వాడీ వర్కర్లు శ్రద్ధ చూపించి చిన్నారులను తమ కు సమీపంలోని గ్రామ/ వార్డు సచివాలయాలకు తీసుకువెళ్లి ఆధార్ నమోదు చేయించాల్సి ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు సరైన అవగాహన కల్పించక పోవడంతో కూడా నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా చిన్నారులకు ఆధార్ నమోదు చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవడం శోచనీయం. అలాగే గ్రామ/ వార్డు సచివాలయాలకు కూడా అరకొరగానే కిట్లను సరఫరా చేశారు. జిల్లాలో మొత్తం 672 గ్రామ, 207 వార్డు ( మొత్తం 672 ) సచివాలయాలు ఉండగా, ఈ మొత్తం సచివాలయాలకు కలిపి 134 ఆధార్ నమోదు కిట్లను సరఫరా చేయగా, ఇందులో 40 కిట్లు పలు కారణాల వల్ల పనిచేయడం లేదు. కే వ లం 90 కిట్లు మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం.
74,784 మంది చిన్నారులకు
ఆధారే లేదు..
గత ఏడాది డిసెంబర్ నెల నుంచి చిన్నారుల ఆధార్ నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, నేటి వరకు ఇంకా జిల్లాలో 74,784 మంది చిన్నారులకు ఆధార్ నమోదు కాలేదు. మొత్తం జిల్లాలో 0–6 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చిన్నారులు 1,06,944 మంది ఉండగా, ఇప్పటి వరకు 32,160 మంది చిన్నారుల ఆధార్ మాత్రమే నమోదు చేశారు. ఇంకా 74,784 మంది చిన్నారుల ఆధార్ నమోదు చేయాల్సి ఉంది. అలాగే, గ్రామ/ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు డిజిటల్ అసిస్టెంట్లకు కూడా ఆధార్ నమోదుకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన లేని కారణంగా కూడా పలు ప్రాంతాల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వలసల ప్రభావం కూడా ...
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో పనులు లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు అధిక శాతం పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. వారి వలసల ప్రభావం కూడా చిన్నారుల ఆధార్ నమోదుపై పడింది. ఈ నేపథ్యంలోనే పడమటి ప్రాంతాలైన కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు, తుగ్గలి, ఆలూరు, హాలహర్వి, సీ బెళగల్, చిప్పగిరి, మద్దికెర తదితర మండలాల్లో బాల ఆధార్ నమోదు ప్రక్రియ తక్కువ శాతంగా నమోదవుతోంది. అలాగే ఆయా ప్రాంతాల్లో డిజిటల్ అసిస్టెంట్ల కొరత కూడా వేధిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment