వైభవంగా వసంత పంచమి
కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలోని శివపురం గ్రామం శివారులో వెలసిన కొలనుభారతి దేవి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ ఈఓ రామలింగారెడ్డి, దేవదాయ శాఖ జిల్లా ఇన్‌చార్జ్ అసిస్టెంట్ కమిషనర్ మోహన్, ఆలయ చైర్మన్ వెంకటనాయు డు ఆధ్వర్యంలో అమ్మవారిని జ్ఞాన స్వ రూపిణి సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి అభిషేకం, సర్వసతి హోమాలు, చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు.
పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలం దేవస్థానం సూపరింటెండెంట్ నాగేశ్వరరావు ఆలయ వేద పండితులతో కలిసి ఆదివారం ఉదయం కొలనుభారతి దేవి క్షేత్రానికి చేరుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఆర్డీఓ నాగజ్యోతి, సర్పంచు చంద్రశేఖర్ యాదవ్, ఎంపీపీ కుసుమలత, తహసీల్దార్ ఉమారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తరలివచ్చిన భక్తులు
వసంత పంచమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధ ర్ బాబు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిల ప్రియ, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధి కారి పట్టాభి, జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, తహసీల్దార్లు చంద్రశేఖర్ నాయక్, శ్రీనివాసులు, ఎంపీటీసీ శివన్న, సర్పంచు నిత్యలక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కె.సుధాకర్ రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ జనార్దన్‌రెడ్డి, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
వేడుకగా అక్షరాభ్యాసాలు
సర్వసతీదేవి పుట్టిన రోజును పురస్కరించుకుని సా మూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం వేడుకగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. 510 మంది చిన్నారులకు వేదపండితుల సమక్షంలో బీజాక్షరాలు దిద్దించారు.
కొలనుభారతిదేవి క్షేత్రానికి
పోటెత్తిన భక్తులు
సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన
అమ్మవారు
పట్టు వస్త్రాలు సమర్పించిన
శ్రీశైల దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment