ట్రాక్టర్లకు అధికార ముద్ర
తుంగ భద్ర నదితీర గ్రామాల్లో వెంబడి పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. దాదాపు 150కి పైగా ట్రాక్టర్లు ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. ఒక్కో ట్రాక్టర్ రోజుకు 3 నుంచి 4 ట్రిప్పులు రవాణా చేస్తున్నారు. దీంతో రోజుకు 300 నుంచి 500 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా ట్రాక్టర్ల నంబర్ల జాబితాను ముందుగానే అధికారులకు పంపించడంతో వాటిని ఎవరూ ఆపడం లేదని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాక్టర్లపై మాత్రమే దాడి చేసి జరిమానా విధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబఽంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నా మామూళ్ల మత్తులో అఽధికారులు పట్టించుకోవడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మైనింగ్, రెవెన్యూ అఽధికారులకు మామూళ్లు అందుతుండటంతో ఇసుక మాఫియా దందాను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇసుక అక్రమంగా
తరలిస్తే చర్యలు
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. పోలీసులు రాత్రిళ్లు పహారా కాస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. అధికారిక రీచ్‌ల వద్ద కొంత మంది స్థానిక నాయకుల సిఫారసు కలిగిన వాహనాలకే ఇసుకను లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ చేపడతాం.
– మైనింగ్ డీడీ రవిచందర్
Comments
Please login to add a commentAdd a comment