![మాట్లాడుతున్న ఉపసర్పంచ్ సునీత, గ్రామస్తులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/15/14drk353-330156_mr_0.jpg.webp?itok=YwStVFsq)
మాట్లాడుతున్న ఉపసర్పంచ్ సునీత, గ్రామస్తులు
చిన్నగూడూరు: మండలంలోని మన్నెగూడెం గ్రామ పంచాయతీ నిధుల్లో అవినీతి జరిగిందంటూ ఉపసర్పంచ్ కూరాకుల సునీత ఆరోపించారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో వార్డు సభ్యులతో కలిసి ఆమె మాట్లాడారు. సర్పంచ్ వెంకట్రాములు స్థానికంగా ఉండడం లేదని, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో సరిపడా సిబ్బంది లేక అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుందన్నారు. చెత్త తలించడానికి ట్రాక్టర్ ఉన్నప్పటికీ దానిని వినియోగించడం లేదన్నారు. జీపీ ట్రాక్టర్ టైర్లను సర్పంచ్ తన సొంత ట్రాక్టర్‌కు అమర్చుకున్నట్లు ఆరోపించారు. శ్మశాన వాటిక భూమిని తనపేరు మీద పట్టా చేసుకున్నాడని తెలిపారు. పలు అభివృద్ధి పనులు, ఈజీఎస్ పనుల్లో దాదాపు రూ.4లక్షల అవినీతి జరిగిందన్నారు. గతంలో అవినీతి జరిగినట్లు గ్రహించి ఫిర్యాదు చేశామని, డీపీఓ వచ్చి విచారణ చేసి సర్పంచ్‌కు షోకాజు నోటీసులు ఇచ్చారని తెలిపారు. అయినా సర్పంచ్ తీరులో ఎలాంటి మార్పురాలేదని, మళ్లీ అవినీతికి పా
ల్పడ్డాడని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు అనసూయ, సోమయ్య, గ్రామస్తులు కూరాకుల రామకృష్ణ, బంటు రవి, బొమ్మకంటి నాగమల్లేశ్వర్ రావు, బొమ్మకంటి శ్రీను తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment