![గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న డీఎం విజయ్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/1/31drk352-330156_mr.jpg.webp?itok=VWY4lPc9)
గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న డీఎం విజయ్
చిన్నగూడూరు: ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితంగా ఉంటుందని మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఉగ్గంపల్లిలో ప్రజల వద్దకు ఆర్టీసీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమన్నారు. ప్రజల కోసం ఆర్టీసీ పలు సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వివాహాది శుభకార్యాలకు 10శాతం రాయితీతో ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ ఇన్‌చార్జ్ అజీముద్దీన్, సిబ్బంది నర్సయ్య, నభి, కార్యదర్శి సోమన్న, గ్రామస్తులు మల్లేశం, ఆదిబాబు, సత్యం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment