![అంబులెన్స్‌లో ప్రసవించిన శివాని - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/5/04mbd357-330028_mr.jpg.webp?itok=Sxa5vPl-)
అంబులెన్స్‌లో ప్రసవించిన శివాని
గూడూరు: మండలంలోని గుండెంగ గ్రామ శివారు బీర్బల్‌తండాకు చెందిన అజ్మీరా శివాని అనే మహిళ మంగళవారం రాత్రి 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. సిబ్బంది ఈఎన్‌టీ అనిల్‌కుమార్, పైలెట్ అజీజ్‌మియా తెలిపిన వివరాల ప్రకారం.. బీర్బల్‌తండాకు చెందిన అజ్మీరా శివాని పురిటి నొప్పులతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే ఆమె గ్రామానికి వెళ్లి వాహనంలో గూడూరు సీహెచ్‌సీకి తరలిస్తుండగా, మార్గమధ్యలో శివానికి పురుటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనం పక్కకు నిలిపి ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను గూడూరు సీహెచ్‌సీకి తరలించారు. అంబులెన్స్‌లో వైద్య సేవలు అందించిన వాహన సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment