![పెట్రోల్‌తో నిరసన వ్యక్తం చేస్తున్న దళిత మహిళ - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/2/01drk351-330156_mr.jpg.webp?itok=Fsw8OjwN)
పెట్రోల్‌తో నిరసన వ్యక్తం చేస్తున్న దళిత మహిళ
చిన్నగూడూరు: 30ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తన భూమిని తనకు ఇప్పించాలని దళిత మహిళ పెట్రోల్‌తో నిరసన వ్యక్తి చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలు మద్దెల యాదమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగూడూరు నుంచి జయ్యారం వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఉన్న పట్టా సాగుభూమి (సర్వే నెంబర్ 129)ని అధికారులు, ప్రజాప్రతినిధులు లాక్కోని అక్రమంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. తన కొడుకుకు రూ.10 లక్షలు ఇచ్చి భూమి కొన్నామంటూ స్థానిక లీడర్లు చెప్పుతున్నారని, తన పేరున ఉన్న భూమిని నా ప్రమేయం లేకుండా ఎలా కొంటారంటూ బాధితురాలు తెలుపుతున్నారు. తనకు సర్వే నెంబర్ 129లో 4 ఎకరాల భూమిలో రాళ్లు రప్పలు తీసి చదును చే శానని అందులో ఎకరం భూమిని నా భర్త జ్ఞాపకార్థం పోలీస్ స్టేషన్‌కు ఇచ్చానన్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇవ్వమన్నాడని బీఆర్‌ఎస్ నాయకులు దౌర్జన్యంగా తన భూమిని ఆక్రమించారని ఆరోపించారు. నా భర్త అనారోగ్యం రీత్యా రూ. 20 లక్షలు అప్పు చేసిన ఫలితం లేదన్నారు. చేసిన అప్పులకు నెలనెలా వడ్డీలు కడుతూ జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడు అన్యాయంగా నా భూమిని ఆక్రమించారంటూ కన్నీరుమున్నీరయ్యారు. నా భూమి నాకు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భర్త సమాధిపై రోదిస్తున్న తీరుతో స్థానికులు కలత చెందారు.
Comments
Please login to add a commentAdd a comment