ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి

Published Sun, Aug 6 2023 1:44 AM | Last Updated on Sun, Aug 6 2023 1:44 AM

ఇంకుడుగుంతను పరిశీలిస్తున్న డీపీఓ   - Sakshi

ఇంకుడుగుంతను పరిశీలిస్తున్న డీపీఓ

చిన్నగూడూరు: గ్రామాల్లో ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని డీపీఓ (డిప్యూటీ సీఈఓ) నర్మద తెలిపారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి గ్రా మ పంచాయతీని సందర్శించారు. జీపీలోని రికార్డులు, జీపీ ఆవరణలోని ఇంకుడుగుంతను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తాచెదారాన్ని జీపీ ట్రాక్టర్‌ ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలించాలన్నారు. గ్రామంలో పారి శుద్ధ్యంపై దృష్టి సారించాలని పంచాయతీ సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యాంసుందర్‌, మండల ప్రత్యేకాధికారి విజయ్‌ కుమార్‌, ఎంపీఓ యాకయ్య, జీపీ కార్యదర్శులు సోమన్న, స్వరూప తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement