![నాయనమ్మతో మాట్లాడుతున్న బాలిక - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/27/26drk351-330156_mr_0.jpg.webp?itok=atLPIIok)
నాయనమ్మతో మాట్లాడుతున్న బాలిక
చిన్నగూడూరు: అనాథ బాలల సంరక్షణకు బాలసదన్ తోడ్పడుతుందని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి అన్నారు. మండల కేంద్రానికి చెందిన బాలిక పిల్లి ఝాన్సీ తల్లి చిన్నప్పుడే మరణించడంతో తండ్రి మరొక వివాహం చేసుకుని వెళ్లిపోయాడు. అనాథగా మారిన బాలికను బాలల సంరక్షణ అధి కారులు చేరదీసి హైదరాబాద్‌లోని బాల సదన్‌కు తరలించారు. ఝాన్సీ ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఝాన్సీ ప్రస్తుతం మేజర్ కావడంతో బాలల సంరక్షణ అధికారులు శనివారం మండల కేంద్రంలోని తమ బంధువులకు అప్పజెప్పేందుకు తీసుకొచ్చారు. ఇంటిదగ్గర నాన మ్మ వృద్ధాప్యంలో ఉండడంతో బాలిక సంరక్షణను నిరాకరించడంతో అధికారులు మరలా బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. బాలల హక్కులను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చైర్‌పర్సన్ నాగవాణి కోరారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ కమిటీ మెంబర్ డేవిడ్, ప్రొటెక్షన్ ఆఫీసర్స్ వీరన్న, నరేష్, కౌన్సిలింగ్ అధికారి రమేష్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సుగుణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment