![మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/3/02drk353-330156_mr.jpg.webp?itok=bVoBnzxB)
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్
చిన్నగూడూరు: సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మన పల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శనివారం డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్నగూడూరు మండల కేంద్రంతో పాటు విస్సంపల్లి, తుమ్మల చెరువు తండా, చేపూరి తండాలో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపనలను చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే రెడ్యాను కోలాట నృత్యాలతో, పూ లమాలలతో ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేశామని, మరిపెడలో 100 పడకల ఆస్పత్రి, రూ.37 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేశామన్నారు. గతంలో కంటే ఎక్కువ మె జార్టీతో గెలుస్తానని, అందుకు ప్రతి ఒక్కరి దీవెనలు కావాలన్నారు. మూడోసారి సీఎం కేసీఆరేనని, ఎమ్మెల్యేగా గెలిచేది నేనేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లూరి పద్మ, రైతుబంధు కో ఆర్డినేటర్ మంగపతిరావు నాయకులు వెంకట్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, నిరూప, ధారాసింగ్, వీరన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రెడ్యానాయక్
Comments
Please login to add a commentAdd a comment