ఉపాధ్యాయుల డిప్యుటేషన్!
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు మొదలుకొని కొత్త ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే అన్ని పాఠశాలల్లో ఉపాధ్యామ పోస్టులు భర్తీ కావడంతో తక్కువ విద్యార్థులు ఉన్న చోట ఎక్కువ ఉపాధ్యాయులు, ఎక్కువ విద్యార్థులు ఉన్నచోట తక్కువ ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయుల సేవలను సద్వినియోగం చేసుకోవడం, వర్క్ అడ్జెస్ట్‌మెంట్( పని విభజన)కోసం విద్యాశాఖ అధికారులు కరసత్తు ప్రారంభించారు.
ఉపాధ్యాయుల అవసరం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే పనిలో విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు 1,221 ఉన్నాయి. ఇందులో 98,112 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి బోధించేందుకు అన్ని కేడర్ల ఉపాధ్యాయులు 3,423 మంది ఉన్నారు. అయితే కొత్తగా డీఎస్సీ ద్వారా 356 మంది ఉపాధ్యాయులను భర్తీ చేశారు. పోస్టుల మంజూరు ఉన్న పాఠశాలకు కొత్త ఉపాధ్యాయులను నియమించారు. అయితే జిల్లాలో 159మేరకు పాఠశాలల్లో విద్యార్థులు లేరని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే పని ఉపాధ్యాయులపై పెట్టినా.. విద్యాసంవత్సరం మధ్యలో ఉండటంతో ఇప్పటికిప్పుడు విద్యార్థులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలతోపాటు, పిల్లలు లేని పాఠశాలల్లో పనిచేసే వారిని కూడా వేరేచోటుకు పంపించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఎంఈఓల ద్వారా జాబితా
మండల విద్యాశాఖ అధికారుల(ఎంఈఓ) ద్వారా పని విభజన జాబితాను తెప్పించినట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికా రి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం పెట్టి వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాంప్లెక్స్ బాధ్యులతోపాటు, ప్రధానో పాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయుల అవసరా ల నివేదికను తీసుకొని ఎంఈఓ జిల్లా విద్యాశా ఖ అధికారికి పంపినట్లు తెలిసింది. ఇలా జిల్లాలోని 190 మందికి పైగా ఉపాధ్యాయులను తాము పనిచేస్తున్న చోటు నుంచి మరోచోటు కు డిప్యుటేషన్ వేసే పనిలో విద్యాశాఖ ఉంది.
టీచర్ల పని విభజనపై కసరత్తు
ఏంఈఓల ద్వారా వివరాల సేకరణ
విద్యార్థులు లేని.. ఉపాధ్యాయులు
ఎక్కువ ఉన్న పాఠశాలల గుర్తింపు
ఆ స్కూళ్ల నుంచి
వేరేచోటుకు డిప్యుటేషన్
Comments
Please login to add a commentAdd a comment