పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు
మరిపెడ: పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని కార్గిల్ సెంటర్‌లో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కార్గిల్ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం పిచ్చికుక్క అటుగా వెళ్తున్న మరిపెడ మండలానికి చెందిన మెరుగు సంజీవ, మాలోతు అనిల్, ధారవత్ కొమరెల్లి, బానోతు నాగులు, దుర్గాప్రసాద్, ఖమ్మం జిల్లాకు చెందిన బొబ్బ సంజీవరెడ్డిని కరిచింది. వెంటనే వారు స్థానిక పీహెచ్‌సీకి వెళ్లి యాంటీరేబిస్ ఇంజక్షన్లు వేయించుకున్నారు. మెరుగైన చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్ గుగులోతు రవికుమార్ తెలిపారు.
గిరిజన జర్నలిస్టులకు
శిక్షణ తరగతులు
మహబూబాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ములుగు, మానుకోట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని గిరిజన జర్నలిస్టులకు శిక్షణ తరగతులను డిసెంబర్ మాసంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల గిరిజన వర్కింగ్ జర్నలిస్టులు శిక్షణా తరగతులకు హాజరు కావడానికి పేర్లను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.
నిబంధనల మేరకు ధాన్యం
కొనుగోలు చేయాలి
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ నిబంధనల మేరకు ఎఫ్‌ఏక్యూ నామ్స్ అనుసరించి ధాన్యం కొనుగోళ్లు జరపాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి అన్నారు. మండలంలోని ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు శుద్ధి చేసిన ధాన్యాన్ని ఎఫ్‌ఏక్యూ నామ్స్ అనుసరించి తేమ శాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే బాగుంటుందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. రైతులకు, కొనుగోలు కేంద్రాల వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట డీఎస్‌ఓ ప్రేంకుమార్, ఏపీఎం తిలక్ తదితరులు ఉన్నారు.
లైఫ్ సర్టిఫికెట్లు
అందజేయాలి
మహబూబాబాద్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.3000 చొప్పున పింఛన్ మీడియా అకాడమీ ద్వారా అందచేయడం జరుగుతుందని డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టుల కుటుంబాలు ఈ సంవత్సరం 2024–25 సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్లను డీపీఆర్వో కార్యాలయంలో ఈనెల 26వ తేదీలోపు అందజేయాలని కోరారు.
ఆస్పత్రుల్లో
డీఎంహెచ్‌ఓ తనిఖీ
నెహ్రూ సెంటర్: పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ మురళీధర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతి ఆస్పత్రి యాజమాన్యం ఆస్పత్రి ఆవరణలో ధరల పట్టికను ప్రదర్శించాలని, ఫైర్ సేఫ్టీ పరికరాలను అమర్చుకోవాలన్నారు. జిల్లాలో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, ఎవరైనా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలన్నారు. తనిఖీల్లో పొరపాట్లను గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment