అధికారుల నిర్లక్ష్యం.. మహిళలకు శాపం
మహబూబాబాద్: బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం.. మహిళా సంఘం సభ్యులకు శాపంగా మారింది. గ్రూపు సభ్యులందరూ రుణం తీసుకోగా బ్యాంక్ సిబ్బంది లీడర్ల ఆధార్‌కు రుణాన్ని లింక్ చేశారు. దీంతో లీడర్లు వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు చూపిస్తుండటంతో కిస్తీలు చెల్లించడం మానేశారు. ఫలితంగా లీడర్లకు, గ్రూపు సభ్యులకు మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ సమస్యను సంబంధిత అధికారులు, బ్యాంక్ సిబ్బంది పరిష్కరించకపోవడంతో గ్రూప్ సభ్యులు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పట్ణణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. 90 మంది ఆర్పీలు పని చేస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీలకు 2,600 మహిళా సంఘాల్లో సుమారు 25,000 మంది సభ్యులు ఉన్నట్లు మెప్మా డీఎంపీ విజయ తెలిపారు. కాగా మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని ఽశ్రీమహలక్ష్మి గ్రూపు ఆరు నెలలు క్రితం బ్యాంక్‌లో రుణం తీసుకున్నారు. ఇద్దరు లీడర్లతో పాటు 8 మంది సభ్యులు మొత్తం పది మంది ఉంటారు. గ్రూపు లీడర్ జి.మనీషా, సెకండ్ లీడర్ డి.సరితతో పాటు గ్రూపు స భ్యులు ఆర్పీ పద్మ ఆధ్వర్యంలో రూ.13.40 లక్షల రుణం తీసుకున్నారు. మొదటి లీడర్ రూ 1,65,000 రెండో లీడర్ రూ. 1,50,000 తీసుకోవడంతో పాటు పది మంది సభ్యులు కలిసి పొదుపు నిమిత్తం రూ.లక్ష పక్కకు పెట్టి వారి పొదుపు ఖాతాలో జమ చేశారు. మూడు నెలలు పాటు గ్రూపు చెల్లింపు సజావుగానే జరిగింది.
వ్యక్తిగత రుణం కోసం వెళ్తే..
మొదటి లీడర్ మనిషా వ్యక్తిగత రుణం కోసం వేరే బ్యాంకుకు వెళ్తే మొదటి, రెండో లీడర్ పేరున రూ.13.40లక్షల రుణం తీసుకున్నట్లు ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. దీంతో ఆ లీడర్లు రుణం తీసుకున్న బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా ఆధార్ లింక్ చేయగా ఆలా వస్తుందని తెలిపారు. ఆనాటి నుంచి మూడు నెలలుగా లీడర్లు కిస్తీలు చెల్లించడం లేదు. దీంతో లీడర్లకు, సభ్యులకు గొడవ మొదలైందని ఆర్పీ పేర్కొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ఈ నెల 21న గ్రూప్ లీడర్లతో పాటు సభ్యులు కలిసి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మెప్మా డీఎంసీ విజయ, ఆర్పీలు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే మూడు నెలలుగా లీ డర్లు కిస్తీలు చెల్లించకపోవడంతోనే సమస్య వచ్చిందని, అధికారులు సైతం సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని సభ్యులు వాపోయారు.
మహిళా సంఘం లీడర్లు వ్యక్తిగత
రుణం తీసుకున్నట్లు చూపిస్తున్న
బ్యాంకు సిబ్బంది
మూడు నెలలుగా ఇబ్బంది
పడుతున్న సభ్యులు
సమస్యను పరిష్కరించాలని ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment