వరి దిగుబడిలో దేశంలోనే నంబర్ వన్
చిన్నగూడూరు: కాళేశ్వరంలో నీళ్లు లేకపోయిన కోటి 60 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నగూడూరు, గుండంరాజుపల్లి, జయ్యారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సకాలంలో మద్ధతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. త్వరలోనే రైతుల అకౌంట్లో రైతుబంధు నిధులు జమ చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ యాదగిరిరెడ్డి, వ్యవసాయ అధికారి భాస్కర్, ఏపీఎం పాపయ్య, తెలంగాణ ఆయిల్‌పామ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ వల్లూరి కృష్ణారెడ్డి, నాయకులు మూల మురళీధర్ రెడ్డి, గునిగంటి కమలాకర్, పిల్లి వీరన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్
Comments
Please login to add a commentAdd a comment