నాణ్యమైన భోజనం అందించాలి
గార్ల: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ వసతిగృహాల వార్డెన్లను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం గార్లలోని పలు హాస్టళ్లను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గార్లలోని బీసీ బాలికల వసతిగృహం, కస్తూర్బాగాంధీ పాఠశాల, ఆశ్రమ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం మంచిగా పెడుతున్నారా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలని సూచించారు. అలాగే విద్యార్థుల టాయిలెట్లు, బాత్‌రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థులకు చలికాలంలో ప్రభుత్వం అందించే రగ్గులు, దుప్పట్లను వెంటనే అందజేయాలని సూచించారు. అనంతరం గార్ల ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న సమగ్ర సర్వే ధరఖాస్తుల డేటా ఎంట్రీల ఆన్‌లైన్ నమోదును పరిశీలించారు. ఆన్‌లైన్ నమోదులో తప్పులు లేకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. డీపీఓ వెంట ఎంపీడీఓ మంగమ్మ, డీటీ జర్పుల సుధాకర్, పంచాయతీ కార్యదర్శి అజ్మీర కిషన్, రమేష్, వార్డెన్లు పాల్గొన్నారు.
డీపీఓ హరిప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment