No Headline
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. వారం రోజుల నుంచి చలితో ప్రజలు వణికిపోతున్నారు. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా చలి తీవ్రత పెరిగింది. ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. అలాగే సాయంత్రం నాలుగు గంటలకే చలి తీవ్రత పెరుగుతోంది. కాగా పిల్లలు, వృద్ధులు వ్యాధుల బారిన పడుతున్నారని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం తొమ్మిది గంటల దాటే వరకు పొగ మంచు వీడడం లేదు. దీంతో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప.. ఉదయం తొమ్మిది దాటితే కాని ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచే చల్లగాలులు వీచడం, ఆరు గంటలకు చలి తీవ్రత ఎక్కువ కావడంతో పనులన్నీ ముగించుకొని త్వరగా ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే సెంటర్లు, వ్యాపార కేంద్రాలు ఉదయం పది గంటల వరకు, సాయంత్రం ఆరుగంటలు దాటగానే నిర్మానుష్యంగా ఉంటున్నాయి.
జిల్లాలో వారం రోజుల ఉష్ణోగ్రత
వివరాలు( డిగ్రీ సెల్సియస్)
రక్షణకోసం..
చలి తీవ్రత పెరగడంతో రక్షణ కోసం ప్రజలు వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఏజెన్సీలోని గంగారం, కొత్తగూడ, బయ్యారం, గూడూరు ప్రాంతాల్లో నెగడులు పెట్టుకొని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. ఉన్ని దుస్తులు, చలికోట్లు, మప్లర్లు వేసుకోకపోతే బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వాటికి గిరాకీ పెరిగింది. ఆయా దుకాణాలు రద్దీగా మారాయి. అదేవిధంగా ఇళ్లలో కూలర్లు, ఏసీలు మూలకు పడేసి, కనీసం ఫ్యాన్లు కూడా వేసుకునేందుకు భయపడుతున్నారు. వేడినిచ్చే బల్బులు వేసుకొని వెచ్చటి గదులకే పరిమితం అవుతున్నారు.
జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
వ్యాధుల బారిన పడుతున్న
వృద్ధులు, పిల్లలు
జాగ్రత్తలు తీసుకోవాలి: డాక్టర్లు
ఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్న ప్రజలు
తేదీ గరిష్ట కనిష్ట
26 30 15
27 29 15
28 28 16
తేదీ గరిష్ట కనిష్ట
22 30 16
23 29 15
24 29 16
25 28 15
Comments
Please login to add a commentAdd a comment