వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ గేటుకు సిబ్బంది తాళం వేయగా ధాన్యం విక్రయానికి తీసుకువచ్చిన వాహనాలు గురువారం మార్కెట్ ఎదుట నిలిచిపోయాయి. మార్కెట్‌లో నిల్వ ఉన్న ధాన్యంతో స్థలం లేక వాహనాలను అనుమతివ్వలేదు. కాగా 7,082 బస్తాల ధాన్యం విక్రయాలు జరిగిన తర్వాత.. మార్కెట్ బయట ఉన్న వాహనాలను యార్డులోకి అనుమతించారు.
నేడు ధాన్యం మార్కెట్ బంద్
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డునకు సరుకులు ఎక్కువగా వచ్చినందువల్ల శుక్రవారం ధాన్యం మార్కెట్ బంద్ ఉంటుందని ఏఎంసీ సెక్రటరీ షంషీర్ గురువారం తెలిపారు. ధాన్యం అధికంగా వచ్చిన నేపథ్యంలో కాంటాలు పెట్టడం ఆలస్యమవుతుందన్నారు. అదేవిధంగా వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారం ధాన్యం మార్కెట్ బంద్ చేశామని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ ధాన్యం విక్రయానికి వ్యవసాయ మార్కెట్ యార్డునకు తీసుకురావద్దని పేర్కొన్నారు. ధాన్యం మార్కెట్ బంద్ ఉన్నప్పటికీ... పత్తి, మిర్చి మార్కెట్ యథావిధిగా నడుస్తుందని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
నిలిచిన ధాన్యం వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment