లైంగిక చర్యలకు కఠిన శిక్షలు
మహబూబాబాద్ రూరల్: పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక చర్యలకు పాల్పడితే కఠినశిక్ష తప్పదని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయస్థానం ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో లైంగికపరమైన ఇబ్బందులు ఎదురైతే న్యాయమూర్తుల కమిటీకి విన్నవించుకుని న్యాయం పొందవచ్చని సూచించారు. నేరం రుజువైతే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. కాగా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లో ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ గురువారం పూజలు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి సురేష్, జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, జిల్లాకోర్టు పరిపాలన అధికారి క్రాంతికుమార్, సూపరింటెండెంట్ అమరేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కీసర పద్మాకర్ రెడ్డి, ఏపీఎం తిలక్, దళ్ సింగ్, శంతన్ రామరాజు, పద్మబాయి, నారా యణసింగ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారం..
జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ, సీనియర్ సివి ల్ జడ్జి సురేష్, జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, జా తీయ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షు డు జగన్నాథం సమక్షంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పోలెపల్లి శ్రీ ను, జనరల్ సెక్రటరీ వెంకటరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్లు స్వరూపరాణి, శివకుమార్, నిరీక్షణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పూస శ్రీనివాస్, ట్రెజరర్ వీరునాయక్, జాయింట్ సెక్రటరీలు వీరలక్ష్మి, రుచిత, ఝాన్సీ, స్పోర్ట్స్ సెక్రటరీ స్వాతి ప్రమాణస్వీకారం చేశారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
డి.రవీంద్రశర్మ
Comments
Please login to add a commentAdd a comment