‘దీక్షా దివస్’ను విజయవంతం చేయాలి
మహబూబాబాద్: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కార్యక్రమం జిల్లా ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మె ల్యే కొండా బాలకోటేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 18 మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ నిర్వహిస్తామని, దీనిలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం ఎదుట నివాళులర్పిస్తామన్నారు. మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉదయం 9.30గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయమి ధీమా వ్యక్తం చేశారు. కాగా, సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు జెర్రిపోతుల వెంకన్నతో పాటు పలువురు నాయకులు ఉద్యమకారులను గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ వైస్ చెర్మన్ వెంకన్న, నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్, కన్నా, మాధవి, రంజిత్, బాలాజీ నాయక్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్,రాజు, యుగేందర్ ఉన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే
బాల కోటేశ్వర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment