వందశాతం ఫలితాలు సాధించాలి
డీఈఓ రవీందర్‌రెడ్డి
కురవి: పదో తరగతి విద్యార్థినులు వందశాతం ఫలితాలు సాధించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నేరడలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈ ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గది, భోజనాలు, స్టోర్‌రూం, బియ్యం, వంట దినుసులను పరిశీలించారు. ఈ సందర్భంగా బాలికలతో మాట్లాడుతూ.. పది తరగ తిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ రాజేశ్వర్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎంఈఓ బాలాజీ, పాఠశాల ఎస్‌ఓ డి.సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
తిరగబడ్డ ట్రాక్టర్..
బురదలో ఇరుక్కున్న డ్రైవర్
కొత్తగూడ: దుమ్ము చేస్తున్న ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ బురదలో ఇరుకున్న సంఘటన మండలంలోని కోనాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన బుద్దినేని రవి అనే ట్రాక్టర్ డ్రైవర్ రైతు బండారి కుమారస్వామి పొలాన్ని కేజ్‌వీల్స్‌తో దుమ్ము చేస్తున్నాడు. వీల్స్‌లో బురద చిక్కుకుని ట్రాక్టర్ తిరగబడింది. డ్రైవర్ రవి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయాడు. గమనించిన చుట్టు పక్క రైతులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేసుకుని ట్రాక్టర్ కింద నుంచి డ్రైవర్‌ను బయటకు లాగా రు. ఈ ఘటనలో రవి చేయి విరగడంతో పా టు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమి త్తం వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
కొనుగోలు కేంద్రాల్లో మోసాలను అరికట్టాలి
నెహ్రూసెంటర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టి, రైతులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల భిక్షపతి, గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ, రైతు భరోసాను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా, ఇథనాల్ కంపెనీల కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2011 సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి రైతు బంధు, భరోసా, రుణమాఫీ చేయాలన్నారు. సమావేశంలో సంఘం నాయకులు జడ సత్యనారాయణ, మోకాళ్ల మురళీకృష్ణ, గుజ్జు దేవేందర్, గట్టి కృష్ణ, భూక్య నర్సింగ్, బొమ్మెడ సాంబయ్య, కలకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారంలో జేబుదొంగల చేతివాటం
రూ.5 లక్షలకుపైగా దోచుకున్నట్లు సమాచారం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆదివారం జేబుదొంగలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల డబ్బులు దోచేశారు. సీరోలు మండలం కొత్తూరు(సి) గ్రామానికి చెందిన చిట్టూరి లక్ష్మీనారాయణ జేబులోనుంచి రూ.50 వేలు, రేకులతండాకు చెందిన తేజావత్ బాలకృష్ణ వద్ద రూ.15వేలు, మహబూబాబాద్ పట్టణానికి చెందిన తేజావత్ చిరంజీవి వద్ద రూ.27,200, వ్యాపారి సదానందం వద్ద రూ.23,200, మహబుబాబాద్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వాంకుడోత్ మల్సూర్ దగ్గర రూ.10 వేలు, నెల్లికుదురు మండలం మధనతుర్తికి చెందిన మౌలానా వద్ద రూ.9.840, మరో వ్యక్తి వద్ద రూ.23 వేలు దొంగిలించారు. ఇంకా పదుల సంఖ్యలో బాధితులు మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. సుమారు 25 మంది వద్ద రూ.5 లక్షలకుపైగా దోచుకున్నట్లు తెలియగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment