డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: హనుమకొండలోని వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల (అటానమస్) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ కోర్సుల రెండో సంవత్సరం మూడో సెమిస్టర్, మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాల్ని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ ఆ కళాశాలలో విడుదల చేసినట్లు ఆదివారం ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 458 మంది విద్యార్థులకుగాను 453 మంది పరీక్షలు రాయగా.. వారిలో 332 మంది (73.29 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 412 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 340 మంది (82.52 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు చంద్రమౌళి తెలిపారు. ఈఫలితాల విడుదలలో ఆ కళాశాల పరీక్షల విభాగం అధికారి డాక్టర్ సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ కొలిపాక శ్రీనివాస్ అకడమిక్ కో–ఆర్డినేటర్ డాక్టర్ అరుణ, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సురేశ్‌బాబు, అధ్యాపకులు డాక్టర్ రాజేశ్వరి, మమత మధు, సువర్ణ, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment