ప్రమాణ స్వీకారం చేస్తున్న ఏఎంసీ పాలకవర్గం
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క
ఘనంగా మానుకోట ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
హాజరైన ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమెల్యే మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్: ఇందిరమ్మ రాజ్యంలో రైతులు, అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్‌లో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు ఆదివారం మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు గోస అనుభవించారు.. దోచుకున్నదంత దాచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కథలు చెబుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దుచేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని.. పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చామని చెబుతుండగా అవి గ్రామాల్లో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామనిన్నారు. ఏఎంసీ చైర్మన్‌గా ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్‌గా మదన్ గోపాల్ లోయ, సభ్యులుగా వేమిశెట్టి ఏకాంబరం, జంగాల నరసింహారావు, ఆవుల కందయ్య, బాదావత్ బిక్కునాయక్, బండి శైలజ, బట్టు నర్సయ్య, సాధనాల వెంకటేశ్వర్లు, తేజావత్ వెంకన్న, దేశెట్టి మల్లయ్య, సయ్యద్ ఖాసీం, సంపంగి సులోచన, బానోత్ రాములుతో సెక్రటరీ షంషీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, నాయకులు ఘనపురపు అంజయ్య, మిట్టకంటి రామిరెడ్డి, కార్యకర్తలు తదిత రులు ఉన్నారు.
కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అభివృద్ధి..
మరిపెడ/మరిపెడ రూరల్/కురవి: కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మరిపెడలో రూ.25కోట్లతో నిర్మించే అమృత్‌సర్ పథకం, ఇందిరమ్మ మోడల్‌హౌస్‌కు శంకుస్థాపన, ఇందిరమ్మ మహిళా క్యాంటీన్, మండలంలోని బ్బాయిపాలెంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్‌తో కలి సి మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే కురవి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో సుమారు రూ.125 కోట్ల వ్యయంతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి మంత్రి శ్రీని వాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, డీఈఓ రవీందర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ విజయ, మరిపెడ సీడీపీఓ ఎల్ల మ్మ, సూపర్‌వైజర్ ఉష తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment