నిరసనలు.. నిలదీతలు
బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లోu
● కురవి: కురవి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ సునీల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు రాలేదని రాజన్న, తురక రమేశ్, సంగెం భరత్, దుడ్డెల వినోద్ అధికారులను ప్రశ్నించారు. కొందరి పేర్లు ఉండడంతో ప్రజలు లొల్లికి దిగారు. తహసీల్దార్ సునీల్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ నర్సింహాస్వామి జోక్యం చేసుకుని ఇది నిరంతర ప్రక్రియ అని అందరి పేర్లు ఉంటాయని సర్దిచెప్పారు. రైతులకు రుణమాఫీ వర్తించలేదని రైతు తురక రమేశ్ అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో మహిళలు అధికారులను నిలదీశారు. మహిళలు స్టేజీ వద్దకు దూసుకెళ్లడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు వారిని వారించారు. అనంతరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేర్లు చదువుతుండగానే మహిళలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పథకాన్ని గ్రామ సభలో ప్రజలు ముక్తకంఠంతో తిరస్కరించారు. దీంతో ఆ ఒక్క అంశాన్ని పెండింగ్‌లో పెట్టారు. అనంతరం సభ ముగిసినట్లు ప్రకటించి దరఖాస్తులను స్వీకరించారు.
● నర్సింహులపేట: మండలంలోని నర్సింహులపేట, జయపురం, నర్సింహపురం బంజర, పకీరాతండా, లోక్యాతండా, బొ జ్జన్నపేట గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. మండలంలో కొత్త రేషన్‌కార్డుల కోసం 694మంది, పాత కార్డుల్లో పేర్ల చేర్పుల కోసం 1166మంది, ఇందిరమ్మ ఇళ్లు 7,848మంది, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా కోసం 1,588 మందితో జాబితాలు వచ్చాయి. కాగా నర్సింహులపేట గ్రామ సభలో జాబితాలో 30శాతంపైగా అనర్హుల పేర్లు ఉన్నాయని, నిజమైన లబ్ధిదా రుల పేర్లు రాలేదని అధికారులను నిలదీసి గొడవ చేశారు.
● మహబూబాబాద్ రూరల్: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అనర్హులకు చోటుకల్పించారని, అర్హుల పేర్లు గల్లంతు చేశారని ఆరోపిస్తూ పలువురు గ్రామసభల్లో అధికారులతో వాగ్వాదం చేశారు. మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో సో మవారం ప్రజాపాలన గ్రామసభ ఏర్పా టు చేశారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హాజరుకాగా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అనర్హులకు చోటు కల్పించారని గ్రామానికి చెందిన కేతరాజు ఉప్పలయ్య, డెంకని నర్సయ్య, గడ్డం గోపి ఆందోళన చేశారు. ఏపీఓ రమేశ్‌రెడ్డితో వాగ్వాదం చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని పథకం వర్తింపజేస్తామని చెప్పారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment