గ్రామసభను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
కురవి: మండల కేంద్రం శివారు లింగ్యాతండా గ్రామంలో మంగళవారం జరిగిన ప్రజాపాలన గ్రామసభను అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ సునీల్‌రెడ్డితో మాట్లాడారు. అర్హులందరికీ పథకాలు వర్తించే విధంగా చూసుకోవాల ని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. దరఖాస్తుదారులతో మాట్లాడారు. అందరికీ పథకాలు అందుతాయని, అపోహలు పడొద్దని తెలిపారు.
ఆర్థిక ప్రయోజనాల
పేరిట మోసాలు
● సైబర్ సెక్యూరిటీ బ్యూరో
డీఎస్పీ కె.శ్రీనివాస్
మహబూబాబాద్ రూరల్: ఆర్థిక ప్రయోజనాల పేరిట సైబర్ మోసాలు జరుగుతున్నాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కె.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే కొత్త కొత్త ఆలోచనలతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారన్నారు. ఇలాంటి నూతన స్కీంలు, నేరగాళ్లపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విలాసవంతమైన వస్తువులు ఇస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని, రకరకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజల నుంచి మొదటగా సభ్యత్వాలను స్వీకరిస్తారని తెలిపారు. వారితో పాటు మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నంచేసి డబ్బులు కొల్లగొడుతున్నారన్నారు. మోసపోయిన వారు 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో వెంటనే పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలన్నారు.
డీఎస్పీని కలిసిన సీఐ
మహబూ బాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సబ్ డివిజనల్ పోలీసు అధి కారి కార్యాలయంలో డీఎస్పీ తిరుపతిరావును గూడూరు సీఐగా నియామకమైన సూర్యప్రకాశ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.
పీఏసీఎస్ గోదాం తనిఖీ
డోర్నకల్: మండలంలోని కస్నాతండా శివారులోని డోర్నకల్ పీఏసీఎస్ గోదాంను మంగళవారం వ్యవసాయశాఖ ఏడీఏ విజయచంద్ర తనిఖీ చేశారు. గోదాంలో యూరియా నిల్వ లను తనిఖీ చేసిన అనంతరం అమ్మకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డోర్నకల్‌లో యూరి యా కొరత లేదన్నారు. ఈపాస్ మిషన్‌లో ఆధార్ ప్రక్రియ నమోదుకు సంబంధించి సాంకేతిక సమస్యతో పంపిణీ ఆలస్యమవుతుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మురళీమోహన్, ఏఈఓలు పవన్, అవినాష్ పాల్గొన్నారు.
రేపు కౌన్సిల్ సాధారణ
సమావేశం
మహబూబాబాద్: మున్సిపాలిటీ కార్యాలయంలో ఈనెల 23న కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30గంటలకు సమావేశం ఉంటుందన్నారు. సకాలంలో కౌన్సిలర్లు హాజరుకావాలని కోరారు. పాలకమండలి పదవీకాలం ఈనెల 26తో ముగియనుండగా ఇది చివరి సాధారణ సమావేశం కానుంది.
గుడుంబా తయారు చేస్తే
కఠిన చర్యలు
తొర్రూరు: గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఏఈఎస్, తొర్రూరు ఇన్‌చార్జ్ ప్రవీణ్ తెలిపారు. గుడుంబా నిర్మూలన కోసం ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొర్రూరు డివిజన్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పట్టుబడిన 150 లీటర్ల నాటుసారా, రవాణాకు వినియోగిస్తున్న 5 వాహనాలను సీజ్ చేశారు. 2,900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 23 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 39 మందిని బైండోవర్ చేశారు. ఈ దాడుల్లో ఎస్సైలు రవళిరెడ్డి, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment