No Headline
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు నిరసనలు, నిలదీతలతో సాగాయి. అర్హుల జాబితాను అధికారులు ప్రకటించడంతో అందులో తప్పులు జరిగాయని, అధికారులు ఏకపక్షంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆందోళన చేశారు. అర్హులను విస్మరించి అనర్హులకు లబ్ధిచేరూరేలా జా బితాలు ఉన్నాయని గ్రామస్తులు గొడవలకు దిగడ ంతో గ్రామ సభల్లో గందరగోళం చోటుచేసుకుంది.
అవగాహన లేక ఆలస్యంగా..
రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయకూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సర్వే నిర్వహించి లబ్ధిదారుల జాబితా తయారు చేశారు. ఈమేరకు ఈనెల 21నుంచి 24 గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించిన సభలపై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించలేదు. గ్రామ సభలు ఉన్నట్లు కొన్ని చోట్ల ప్రచారం చేయలేదు. దీంతో మహబూబాబాద్ పట్టణంతోపాటు, జిల్లాలోని మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మండలాల్లోని కొన్ని చోట్ల అధికారులు వచ్చినా సభలకు ప్రజలు రాలేదు. దీంతో అక్కడ ఉన్న నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల ను తీసుకురావాల్సి వచ్చింది. దీంతో పలుచోట్ల ఆలస్యంగా సభలు ప్రారంభమయ్యాయి.
ఆందోళనలు..
గ్రామ సభల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలుచోట్ల లబ్ధిదారులు నిరసనలు తెలిపారు. అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జాబితాలో అర్హుల పేర్లు లేవని అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు.
తొర్రూరు మండలంలోని చింతపల్లి, మాటేడు గ్రామాల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి అర్హులను విస్మరించారని అధికారులను నిలదీయగా సమాధానం చెప్పకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. కేసముద్రం గ్రామంలో పథకాల అమలు జాబితా తప్పులతడకగా ఉందని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అదేవిధంగా దంతాలపల్లి, నెల్లికుదురు మండలాల్లో జాబితా తప్పుల తడకగా తయారు చేశారని గ్రామస్తులు నిరసన తెలిపారు.
గందరగోళంగా గ్రామ సభలు
ఎంపికలో అధికారులు ఏకపక్షంగా
వ్యవహరించారని ఆరోపణలు
అర్హులను విస్మరించారని
ఆఫీసర్లతో వాగ్వాదం
Comments
Please login to add a commentAdd a comment