దేశం గర్వపడేలా విజయాలు సాధించాలి
● మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మరిపెడ రూరల్: దేశం గర్వపడేలా విజయాలు సాధించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా యశ్వంత్ సాధించిన విజయాల గురించి వెంకయ్యనాయడు తెలుసుకున్నారు. మారుమూల గిరిజన తండా నుంచి అతి పిన్న వయసులో ఇన్ని విజయాలు సాధించడం అభినందనీయమన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే యశ్వంత్ సంకల్పం గొప్పదన్నారు. ప్రభుత్వాలకు యశ్వంత్ లాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి పేరు తీసుకురావాలని యశ్వంత్‌కు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment