తనయుడి మృతి తట్టుకోలేక..
కొత్తగూడ: కుమారుడి మృతి తట్టుకోలేక మనస్తాపంతో తల్లి కన్నుమూసింది. కుమారుడి దశ దిన కర్మ రోజే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన మంగళవారం కొత్తగూడలో జరిగింది. మండలకేంద్రానికి చెందిన గట్టి యాకమ్మ(70) పక్షవాతంలో సంవత్సర కాలంగా మంచం పట్టింది. అప్పటి నుంచి కుమారుడు నగేశ్(35) తల్లికి సపర్యాలు చేసేవాడు. ఈ క్రమంలో నగేశ్ అనారోగ్యంతో పది రోజుల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి యాకమ్మ మనోవేదనకు గురవుతోంది. ఈ క్రమంలో నగేశ్ కర్మ చేసేందుకు బంధువులు శ్మశానవాటిక వద్దకు వెళ్లి వచ్చే సరికి మృతి చెందింది. ఈఘటనతో మండలకేంద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుమారుడి పెద్ద కర్మ రోజే తల్లి మృతి చెందడం పలువురిని కంట తడి పెట్టించింది.
● కుమారుడి పెద్దకర్మ రోజే తల్లి కన్నుమూత
● కొత్తగూడలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment