మేడారంలో ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్ నల్లాల పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఆదివారం అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు స్నానాల కోసం ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వ్యవసాయదారుల బోరింగ్ మోటర్ల వద్ద స్నానాల కోసం ఒక్కో భక్తుడు రూ.10 చెల్లించాల్సి న పరిస్థితి ఏర్పడింది. మొక్కుల అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో భక్తులు వంటావార్పు కోసం విడిది చేశారు. భక్తులు ఉన్న ప్రదేశాల్లో తాగునీటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో మినరల్ వాటర్ కొనుగోలు చేసి దాహం తీర్చుకోవడంతో పాటు వంటకు కూడా వినియోగించుకోవాల్సి వచ్చింది. ముందస్తుగా మేడారానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మంత్రులు, జిల్లా కలెక్టర్ అదేశాల జారీ చేసిన కొన్ని శాఖ అధికారుల్లో మార్పు కనబడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment