ఎదురుచూపులు...
నెహ్రూసెంటర్: వైద్యారోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం పరిధిలో 37 ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ఏడాది క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. 37 పోస్టులకు గాను 1,661 దరఖాస్తులు వచ్చాయి. దీంతో నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన అధికారులు ఎట్టకేలకు గత నవంబర్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌కు అభ్యర్థులను పిలిచారు. 37 పోస్టులకు గాను 14 పోస్టులను భర్తీ చేసి మిగిలిన 23 పోస్టుల కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోస్టులకు సంబంధించి ఎప్పుడు పిలుస్తారు అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం తలెత్తిన ఇబ్బందుల కారణంగా వాయిదా వేస్తున్నామని చెబుతున్నప్పటికీ వైద్యారోగ్యశాఖలో గతంలో ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఆరోపణలు, పోస్టుల భర్తీ ప్రక్రియలో అధికారులపై వస్తున్న రాజకీయ ఒత్తిడిల కారణంగానే మరింత ఆలస్యం జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు ఎన్నికల కోడ్ రావడంతో భర్తీ ప్రక్రియ కొనసాగుతుందా.. నిలిచిపోతుందా అనే ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు.
ఎదురుచూపులేనా..
దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాల కోసం అభ్యర్థులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. కొంత మందికి పోస్టులు ఇచ్చి, మరి కొంతమందికి నిలిపివేయడంతో మిగిలిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని, అధికారులు నిలిపివేయడంతో ఏం చేయాలో అర్థంకావడం లేదని అభ్యర్థులు అంటున్నారు. వెంటనే మిగిలిన 23 పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.
త్వరలోనే భర్తీ చేస్తాం..
త్వరలోనే ఎన్‌హెచ్‌ఎం కింద మిగిలిన పోస్టులను భర్తీ చేస్తాం. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశాం. కోర్టు కేసులు, ఆర్టీఐ దరఖాస్తుల వల్ల కొంత సమయం పడుతుంది. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అర్హులకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఎలాంటి అపోహలు వద్దు. ఆందోళన చెందవద్దు.
– జి.మురళీధర్, డీఎంహెచ్‌ఓ
వాయిదా వేసిన పోస్టులు ఇవే...
ఎంఎల్‌హెచ్‌పీ 10
ఎన్‌సీడీ స్టాఫ్‌నర్సు 10
ఎంహెచ్‌ఎన్ స్టాఫ్‌నర్సు 02
రిఫ్రిజిరేటర్ మెకానిక్ 1
వైద్యారోగ్యశాఖలో
ఉద్యోగాల భర్తీపై నీలినీడలు
ఏడాది దాటినా పూర్తికాని ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment