పోలీసులకు ఎస్పీ అభినందన
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు ఇటీవల కరీంనగర్‌లో జరిగిన మూడో తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఈమేరకు సోమవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వారిని అభినందించారు. కాగా జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు 4 స్వర్ణ, 4 రజత, 4 కాంస్య పతకాలు సాధించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, ఆర్‌ఐలు భాస్కర్, అనిల్, ఆర్ ఎస్సైలు శేఖర్, సునంద, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment