మాదిగల ఆకాంక్షను చాటుదాం
తొర్రూరు: మాదిగల ఆకాంక్షను చాటేందుకే ఈనెల 7న ‘లక్ష డప్పులు–వేల గొంతులు’ కార్యక్రమం జరగనుందని ప్రముఖ సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ భవనంలో మాదిగ ఉద్యోగులు, ఎంఆర్‌పీఎస్ సంఘ ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సురేందర్ మాట్లాడుతూ.. మాదిగల ఓట్లతోనే తాను సీఎం స్థాయికి ఎదిగానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాలల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణను జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకుల కుట్రలను ఎదుర్కోవడానికి మంద కృష్ణ మాదిగ ఈ నెల 7న ‘వెయ్యి గొంతులు–లక్ష డప్పులు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, ఎంఈఎఫ్ నాయకులు సోమారపు ఐలయ్య, నాయకులు గుండాల నర్సయ్య, రాయిశెట్టి ఉపేందర్, పూర్ణచందర్, కె.భిక్షపతి, బచ్చలి వెంకన్న, వేల్పుల రమేశ్, ధర్మారపు నాగయ్య, పంతం సురేందర్, మల్లేష్, నాగరాజు పాల్గొన్నారు.
సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్
Comments
Please login to add a commentAdd a comment