కళాశాల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ సంఘాల జిల్లా కన్వీనర్ పట్ల మధు, రాష్ట్ర నాయకుడు బోనగిరి మధు డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కరించి, మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, సంఘాల నాయకుల సోమవారం ర్యాలీగా వెళ్లి మూడుకొట్ల సెంటర్‌లో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ.. కళాశాల హాస్టల్‌లో తాగడానికి, ఇతర అవసరాలకు నీరు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వేసవికాలంలో నీటి సమస్య ఎక్కువ అవుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు కళాశాలకు ప్రత్యేకంగా మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. కళాశాల సమస్యలపై ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా ఉన్నత అధికారులు స్పందించి పరిష్కరించాలని, లేని యెడల విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారాకో నిర్వహిస్తామన్నారు. ధర్నా స్థలికి టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ చేరుకొని కళాశాల సమస్యలపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వగా విద్యార్థులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకుల గుగులోత్ సూర్యప్రకాశ్, రాజేశ్, పవన్, మహేశ్, వినోద్, రాకేశ్, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment