వైభవంగా శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ
● పూజల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు,
నాయకులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో భాగంగా శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. పరమహంస పరివ్రజకా చార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి శాస్త్రోక్తంగా వేంకటేశ్వరస్వామి యంత్ర, మూలమూర్తిని ప్రతిష్ఠించారు. అదేవిధంగా ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ఠి, పద్మావతి, గోదాదేవి అమ్మవార్లు, ఆంజనేయ స్వామివారి మూలవిరాట్‌ను ప్రతిష్ఠించారు. నేత్రోన్మీలనం, దృష్టి కుంభం, మహా కుంభాభిషేకం, ప్రథమారాధన, శాంతి కల్యాణం, పారాయణాదుల సమాప్తి, మహా నైవేద్యం, ఇతర పూజలు కనులపండువగా నిర్వహించారు. కాగా ఆలయాన్ని శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి గోవింద క్షేత్రంగా నామకరణం చేశారు. రాత్రి అలివేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామివార్ల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మానుకోట, నర్సంపేట ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, డాక్టర్ ఉమ, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, సంధ్యారాణి, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, సీపీఐ నాయకుడు బి.అజయ్సారథిరెడ్డ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
‘భద్రకాళి’లో వసంత
పంచమి పూజలు
హన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో సోమవారం వసంతపంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అర్చకులు అమ్మవారికి ఉదయం నుంచి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment