బాధితుల్లో సంతాన ఫలాలు
మంగళవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
● ఈపక్క చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేర్లు రవి, స్వరూప. చేతిలో పాపతో ఆనందంగా కనిపిస్తున్న వీరిది స్టేషన్‌ఘన్‌పూర్. పెళ్లయిన కొన్నేళ్లకు రవికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. విషయం తెలియగానే రవి స్వరూప దంపతులు మాతృత్వానికి నోచుకోమని కుమిలిపోయారు. అధునాతన సాంకేతికతతో సంతానం పొందవచ్చని తెలుసుకుని ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. ముందుగా రవి స్పెర్మ్, స్వరూప అండాలను భద్రపర్చారు. అనంతరం రవి కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆతర్వాత వారు ఐవీఎఫ్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు 8 నెలల పండంటి పాపతో ఆదంపతులు మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. క్యాన్సర్‌ను సైతం జయించి మాతృత్వాన్ని పొందారు.
రేపు సాక్షి ఫోన్ ఇన్
మహబూబాబాద్ రూరల్: సైబర్ నేరాలు.. నివారణ చర్యలు, అపరిచిత ఫోన్ కాల్స్, బాధితులు సైబర్ వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకోవడం.. రికవరీ తదితర అంశాలపై జిల్లా సైబర్ పోలీసు అధికారులతో ఈనెల 5న సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. సైబర్ క్రైం డీఎస్పీ కె.శ్రీనివాస్ 87126 65570, సైబర్ క్రైం సీఐ ఎం.వెంకటేశ్వర్లు 87126 65598, సైబర్ క్రైం ఎస్సై బి.కరుణాకర్ 87126 84602, 96034 62487 నంబర్లకు బాధితులు, ప్రజలు కాల్ చేయవచ్చు.
క్యాన్సర్‌ను
జయించి..
Comments
Please login to add a commentAdd a comment