పగిడిద్దరాజు ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం
గంగారం: మేడారం సమ్మక్క, సారలమ్మ మినీజాతర అభివృద్ధి పనుల్లో భాగంగా పూనుగొండ్ల పగిడిద్దరాజు ఆలయానికి నిధులు మంజూరయ్యాయి. ఈనేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు.. పగిడిద్దరాజు ఆలయంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మంత్రి సీతక్క కృషితో గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడ్డిరాజు ఆలయానికి నిధులు మంజూరయ్యారని, ఆ పనులను త్వరితగతిన పూర్తి చేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, మాజీ జెడ్పీటీసీ ఈసం రమాసురేశ్, మాజీ ఎంపీపీ ముడిగ వీరభద్రపోతయ్య, ప్రధాన కార్యదర్శి కొమురయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పెనుక పురుషోత్తం, మండల యూత్ అధ్యక్షుడు ముడిగ విజయ శ్రీధర్, సారలక్ష్మి, కాంతారావు, సురేందర్, నర్సింహారావు, లక్ష్మీనర్సు, సమ్మయ్య, వెంకన్న, సుధాకర్, రాహుల్, ఆదినారాయణ, కిశోర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment