అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
● టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : తాను వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీఆర్‌టీయూ నుంచి ఎన్నికల బరిలో ఉండబోతున్నానని, తనను గెలిపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ, జూవాలజీ, బయోటెక్నాలజీ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలను సందర్శించి ఆయా అధ్యాపకులతో మాట్లాడారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం రిజిస్ట్రార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ రామచంద్రంను కలిసి అభినందించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జనరల్‌సెక్రటరీ ఫలితశ్రీహరి, బాధ్యులు ఉపేందర్‌రెడ్డి, యాకూబ్, డాక్టర్ కుందూరు సుధాకర్, కిరణ్‌కుమార్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment