కేయూలో టాప్ సైంటిస్టులు వీరే..
కేయూ క్యాంపస్: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలకు ర్యాంకింగ్స్ ఇచ్చే అమెరికాకు చెందిన ఏడీ సైంటిఫిక్ ఇండెక్స్(అల్పర్‌డోగల్) ఈ ఏడాది జాబితాను విడుదల చేసింది. పరిశోధనా పత్రాల హెచ్ ఇండెక్స్ ఐ 10 ఇండెక్స్ సైటేషన్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను ఖరారు చేశారు. కాకతీయ యూనివర్సిటీలో టాప్ ఐ సైంటిస్టుల జాబితాను కూడా సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఏడీ సైంటిఫిక్ ఇండెక్స్ ప్రపంచ, జాతీయ, ప్రాంతీయ విషయాల్లో 13 ప్రధాన రంగాలు, 197 ఉప శాఖల్లో అత్యంత సమగ్రమైన విశ్లేషణను అందిస్తుంది. ఈ విశ్లేషణలు గత 6 సంవత్సరాల నుంచి వాటి విలువలతో సహా హెచ్ ఇండెక్స్ ఐ 10 ఇండెక్స్, సైటేషన్ కౌంట్ వంటి సూచికలపై ఆధారపడి ఉంటాయి. 2025 ఈనెల 14 నాటికి ర్యాంకింగ్‌లు మొత్తం హెచ్ ఇండెక్స్ ప్రకారం నిర్ణయించబడి సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రపంచంలో 221 దేశాల్లో 24,503 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న సైంటిస్టుల పరిశోధనలు ఈ సంస్థ పరిశీలన చేయగా అమెరికాలోని హా ర్వర్డ్ యూనివర్సిటీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేయూ 960 స్థానంలో నిలిచింది.
కేయూ సైంటిస్టులు..
యూనివర్సిటీ స్థాయిలో టాప్ 5 సైంటిస్టులుగా కేయూకు చెందిన ఐదుగురు ప్రొఫెసర్లకు స్థానం లభించింది. కేయూ ఫార్మసీ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ రఘురామారావు మొదటిస్థానం, అదే కళాశాలకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ సిద్ది వీరేశం రెండోస్థానం, బయోటెక్నాలజీ విభాగం రి టైర్డ్ ఆచార్యులు సదానందం మూడో స్థానం, జు వాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి నా ల్గో స్థానం, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రసాద్ ఐదో స్థానంలో నిలిచారు. జువాలజీ విభా గం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి పరిశోధనలపరంగా నాలుగు పేటెంట్లు కలిగి ఉండగా.. ఫార్మసీ కళా శాల ప్రొఫెసర్ ప్రసాద్ పలు పేటెంట్లు పొందారు.
కేయూలో టాప్ సైంటిస్టులు వీరే..
కేయూలో టాప్ సైంటిస్టులు వీరే..
కేయూలో టాప్ సైంటిస్టులు వీరే..
కేయూలో టాప్ సైంటిస్టులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment