రైల్వే బ్లాక్‌తో పలు రైళ్ల దారి మళ్లింపు
కాజీపేట రూరల్: కాజీపేట–విజయవాడ మధ్య జరుగుతున్న రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో పలు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు దారి మళ్లించి నడిపిస్తున్నట్లు తెలి పారు. రైళ్ల దారి మళ్లింపుతో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్‌ల నుంచి వివిద ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడనున్నారు.
దారి మళ్లించిన రైళ్లు ఇవే..
ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు షాలీమార్–హైదరాబాద్ (18045) డైలీ వెళ్లే షాలీమార్ ఎక్స్‌ప్రెస్, ముంబాయి–భువనేశ్వర్ (11019) డైలీ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్–ముంబాయి (11020) డైలీ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్–షాలీమార్ (18046) డైలీ వెళ్లే షాలీమార్ ఎక్స్‌ప్రెస్, ఈ నెల 19వ తేదీన షాలీమార్–సికింద్రాబాద్ (22849) వెళ్లే షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్
ఈ నెల 18, 19వ తేదీన ఆదిలాబాద్–తిరుపతి (17406) డైలీ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో రీషెడ్యూల్‌గా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
‘వందేభారత్’ కోచ్‌ల తగ్గింపు
ఈ నెల 19వ తేదీ నుంచి కాజీపేట మీదుగా నాగపూర్ – సికింద్రాబాద్– నాగపూర్ (20101/201002) మధ్య ప్రవేశపెట్టిన నాగపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను తగ్గించి నడిపిస్తున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. నాగపూర్–సికింద్రాబాద్ ప్రధాన నగరాల ప్రాధాన్యతను, ఈ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి పెద్దగా ఆధారణ రాకపోవడంతో కోచ్‌ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గడిచిన 5 నెలల్లో ఆక్యుపెన్సీ రేటు కేవలం 33 శాతం మాత్రమే ఉండటడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని 20 నుంచి 8 కోచ్‌లకు తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఎక్స్‌ప్రెస్‌కు సిర్పూర్‌కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించాలని ప్రయాణికుల డిమాండ్ ఉంది.
భక్తులపై తేనెటీగల దాడి
ఎస్‌ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా మేడారం జాతరకు శుక్రవారం వచ్చిన భక్తులపై తేనెటీగలు దాడి చేయగా సుమారు 15మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి తరలించగా వైద్యాధికారులు చికిత్స చేశారు. వైద్యశిబిరం సందర్శనకు వచ్చిన డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తేనెటీగల దాడిలో గాయపడినవారితో కలిసి శుక్రవారం 110 మందికి వైద్యసేవలు అందించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మేడా రం జాతరలో ఈగలు, దోమలు వ్యాపించకుండా మటన్, చికెన్ షాపులు ఏర్పాటు చేసిన యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కల్పించారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సందర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అ ధికారులు డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ య ము న, డీపీఎంఓ సంజీవరా వు, దుర్గారా వు, వైద్యాధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment