ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి
వరంగల్ చౌరస్తా: ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఐక్యమత్యంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరావది లక్ష్మి నారాయణ తెలిపారు. శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ మహాసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, అమూల్య మైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాబోయే కాలంలో ఆర్యవైశ్యుల విద్య, వైద్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో భారీ భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రేణుకుంట్ల గణేష్ గుప్తా, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఆగిరి వెంకటేష్, రాష్ట్ర నాయకులు గార్లపాటి శ్రీనివాస్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తోట సురేష్, ప్రతినిధులు తల్లాడ వెంకటరామయ్య, రమేశ్, పవిత్ర శ్రీనివాస్, దొడ్డమోహన్ రావు, శ్రీనివాస్, శ్రీ రామ్ రవీందర్, కిషోర్, దాచేపల్లి సీతారాం, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు
లక్ష్మీనారాయణ
Comments
Please login to add a commentAdd a comment