అమ్మవార్లకు మొక్కుగా సమర్పించే ఎత్తు బంగారంతో సమ్మక్క, సారలమ్మల ప్రతిరూపాలుగా అలంకరించిన హైదరాబాద్‌కు చెందిన రాముయాదవ్ కుటుంబ సభ్యుల తీరు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘తరతరాల నుంచి అమ్మవార్లను పూజిస్తున్నాం. ప్రతీ మహాజాతరకు కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం 500 మంది కలిసి మేడారానికి వస్తుంటాం. మినీజాతర సందర్భంగా జాతరకు వచ్చి అమ్మవార్లకు ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తాం. అలాగే అమ్మవార్లకు మొక్కుగా 10 రకాల మద్యాన్ని ఆరగించి పూజలు చేశామని, యాటపోతుతో నైవేద్యం సమర్పించాం విడిది చేసే చోట బంగారంతో అమ్మవార్ల ప్రతిరూపాలను చేసి పూజలు, నైవేద్యం సమర్పించాకే గద్దెలకు వెళ్లి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ’ అని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment